

మనన్యూస్,గొల్లప్రోలు:రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుని కాకినాడ వారి క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టు లెక్చరర్స్ 475 అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల కలిసి వినతి పత్రం.ఈ సందర్భంగా మాణిక్యం గొర్ల మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ కోసం గత ప్రభుత్వం హయాంలో యాక్ట్ 30 చేసి,జీ వో ఎం ఎస్ నెంబర్ 114 విడుదల చేశారని అయితే జనరల్ ఎలక్షన్ కోడ్ కారణంగా చిట్ట చివరి దశలో ఆగిపోయిందని ఎంపీ సానా సతీష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం పై తాను విద్యా శాఖా మాత్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకెళతానని,అవసరమైతే స్వయంగా నారా లోకేష్ వద్దకు తీసుకెళతానన్నారు.మీకు న్యాయం చేసేందుకు నా వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎంపీ సానా ను మాణిక్యం సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గింజాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
