

పేద ప్రజల ప్రశంసలతో తడిసి ముగ్దునడైన ప్రజాసేవకుడు వెంకటేష్
మనన్యూస్,బద్వేలు:అన్ని తానై సిపిఎం పార్టీ నే నమ్ముకుని కల్లాకపటం లేని..నిరు పేదల పక్షాన నిలిచి.. గూడు నీడా లేని నిరుపేదలకు అండగా నిలిచి.. ఎన్నో భూ పోరాట కార్యక్రమాల్లో అండగా నిలిచి.. తల్లి వంటి పార్టీని తనను నమ్ముకున్న ప్రజలకోసం అహర్నిశలు శ్రమిస్తూ.. పేదలపాలిటి అజాతశత్రువుగా వారి గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్రణ వేసుకునే రీతిలో సేవా కార్యక్రమాలు చేసి శభాష్ దాసరి వెంకటేష్ వెంకటేష్ అనిపించుకున్నాడు.. ఆయన మరెవరో కాదు బద్వేల్ రూరల్ సిపిఎం భూ పోరాట కన్వీనర్ దాసరి వెంకటేశ్వర్లు అని ఆ ప్రశంసలు ఆయనకే చెందుతాయి అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.. వివరాలలోకి వెలితే దాసరి వెంకటేశ్వర్లు జన్మించింది కడప జిల్లా అనే కానీ క తన విద్యాభ్యాసం మొత్తం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని చించులూరులో గల పాఠశాలలో ఏడవ తరగతి వరకు విద్యను అభసించి.. తదుపరి పదవ తరగతి మర్రిపాడు మండల కేంద్రంలో గల బారుల వసతి గృహం నందు ఉంటూ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో తన పదవ తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి.. మొదటినుండి తనలోని సేవా దృక్పథాన్ని సిపిఎం పార్టీ వైపు అడుగులు వేస్తూ.. పేద ప్రజల యొక్క కష్టాలను అతి దగ్గర నుండి చూస్తూ.. వారి యొక్క జీవనస్టైలిని మెరుగుపరిచే దిశగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ..ఒక సామాన్య కార్యకర్తగా మొదలెట్టి.. నేడు నియోజకవర్గ స్థాయిలో ఓ మంచి గుర్తింపు కలిగేందుకు ఆయన పడ్డ కష్టం శ్రమ ఎనలేనిది.బద్వేల్ నియోజకవర్గంలోని సుమారు ఐదు నుండి ఏడు పేదల యొక్క నూతన కాలనీలు ఏర్పాటులో ఆయన శ్రమ ఎనలేనిది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు మరెన్నో ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తూ..పలుభూపోరాట కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ.. “శభాష్ దాసరి వెంకటేష్” అంటూ పలువురి యొక్క ప్రశంసలను అందుకుంటూ… అదేవిధంగా మున్ముందు మరెందరో పేదల యొక్క జీవనస్థలిని మెరుగుపరిచేతిస్తూగా అడుగులు వేయాలని పలువురు అనలిస్టులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
