Mana News:- కొత్తగూడెం, మన న్యూస్, నవంబర్, 13, 2024. బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.అక్కడ విధుల్లో ఉన్న అధికారులను కొనుగోలు ప్రక్రియను గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతుల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులుదృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మాయమాటలు చెప్పే దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్, చంద్రుగొండ ఎస్సై స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *