

మనన్యూస్,కామారెడ్డి:చిట్యాల గ్రామానికి చెందిన పులి సప్న, ప్రభాకర్ కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ 2022 సంవత్సరంలో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పటల్లో డెలివరీ చేశారని, ఆపరేషన్ చేసిన తర్వాత వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని ,గత నవంబర్ నెలలో సూరారం వద్ద ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మళ్లీ ఆపరేషన్ చేసుకోవడం జరిగిందని, అట్టి విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా, ఆపరేషన్ చేసిన వైద్యుల పేర్లు, వారి ఐడి నెంబర్ ఇవ్వాలని చెప్పడం జరిగిందని, అప్పుడున్న సూపరిండెంట్ డాక్టర్ విజయలక్ష్మిని అడగడం జరిగిందని, ఇప్పటికి కూడా ఇవ్వలేదని ఒక పత్రికకు మేము డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పడం చాలా బాధాకరమని, ఒకవేళ మేము డబ్బులు డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్ష కైనా సిద్ధంగా ఉన్నామని, అడిగిన సమాచారం ఇవ్వమంటే గత నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వడం లేదని, ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టరు గారీ దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తామని తెలిపారు.
