

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ ఆయకట్టు కింద యాసంగి సీజన్‌లో సాగు చేస్తున్న పంటలకు పూర్తిసాయిలో నీరు అందిస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. నిజాంసాగర్ ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న నీటిని, డిస్టిబ్యూటరీ తూముల ద్వారా నీటి వినియోగాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు ఆన్, ఆఫ్ సిస్టంలో నీటి విడుదల చేపడుతున్నామన్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉండడంతో ఆయకట్టు పంటల అవసరాల మేరకు నాలుగైదు రోజులు నీటి విడుదలను పొడిగిస్తామన్నారు. సాగు నీటిని వృథా చేయొద్దని ఆయన కోరారు.ఆయన వెంట నీటిపారుదల శాఖ ఈఈ సోలేమన్ , సిబ్బంది ఉన్నారు.