

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,: నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో ఆదివారం పడి గల్లంతయిన వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన కర్రె విట్టల్ (40) అనే వ్యక్తి మిషన్ భగీరథ లో అవుట్ సైడ్ కింద విధులు నిర్వహిస్తుంటాడు. కాగా ఆదివారం ఉదయం మహమ్మద్ నగర్ సమీపంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో చేప కనపడటంతో పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాల్వ వరద నీటిలో పడిపోయాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గల్లంతయ్యాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి నీటి పారుదలశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రాజెక్టు నుండి నీటి విడుదలను నిలిపివేసి కర్రె విటల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కరే విటల్ ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటర్ 3 వద్ద కర్రే విట్టల్ మృతదేహం లభ్యం అయింది. పోలీసులు పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు, మృతుని భార్య కర్రె సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మృతునికి భార్య సునీత ఒక కుమార్తె ఉన్నారు. కర్రె విటల్ మృతితో అన్న సాగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
