

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా అలంపూర్ మండలకేంద్రంలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ముందుగా గోమాతను పూజించి ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు మధ్య గో సహిత ప్రదక్షిణలు నిర్వహించారు.ఆపై ఆలయంలోని ముఖ మండపంలో గణపతి పూజలు అభిషేకాలు చేశారు.అదే విధంగా అర్చక స్వాములు ముక్తకంఠంతో మహన్యాస పారాయణాలు నిర్వహించారు.అదేవిధంగా గర్భాలయంలో కొలువుదీరిన బాల బ్రహ్మేశ్వరుడికి నమక చమకాలతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు అన్న సూక్త పారాయణంతో అన్నాభిషేకాన్ని నిర్వహించారు.షడ్రోపితమైన నైవేద్యాలు చేసి దశవిధ నిరాజనాలు సమర్పణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఆనంద్ శర్మ ఉన్నారు