మనన్యూస్,పినపాక:మండలం ఈ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ మన్సూర్ క్రాస్ రోడ్ లో సైబర్ నేరాలు,గంజాయి పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ.తెలియని నెంబర్ల నుంచి ఎవరైనా ఫోన్ చేసి ఓటిపిలు అడిగితే చెప్పొద్దని తెలిపారు.మొబైల్ ఫోన్ కి వచ్చే వెబ్సైట్ లింకులు ఓపెన్ చేయకూడదన్నారు. దానివల్ల నగదు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసి ఉచితంగా డబ్బు వస్తుందని ఆశపడి మోసగాళ్ల ఉచ్చులో పడకూడదన్నారు.
ఎవరైనా పొరపాటున సైబర్ నేరాలు బారిన పడి డబ్బు కోల్పోతే వెంటనే సైబర్ క్రైమ్స్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి కంప్లైంట్ చేయాలన్నారు. లేదా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.ప్రతి ఒక్కరు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.సైబర్ మోసాల గురించి మీ స్నేహితులకు,బంధువులకు కూడా తెలపాలన్నారు.అలాగే యువత తెలియకుండా గంజాయి వంటి మత్తు పదార్థాలు జోలికి వెళ్ళొద్దన్నారు.ఎవరైనా గంజాయి విక్రయింస్తే పోలీసువారికి సమాచారం అందించాలన్నారు.గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే జీవితాలు నాశనం అయిపోతాయన్నారు.ఎవరైనా గంజాయి తీసుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,ఆటో డ్రైవర్లు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *