

మన న్యూస్:నల్లగొండ జిల్లాలో ఈనెల28 నుండి 30వరకు జరిగే టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను జయప్రదం చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు కోరారు. కామారెడ్డి జిల్లా కామరెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య గారి చేతుల మీదుగా గోడ ప్రజలను ఆవిష్కరించారు.నల్లగొండలో ఈ నెల 28 నుండి 30 వరకు జరిగే 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలలో అధ్యాపనం సామాజిక స్పృహ- లక్ష్యం తో హక్కులు -బాధ్యతలు1.భారత ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి ప్రజలకు ఏం జరుగుతుంది 2.విద్యలో రాజ్యాంగం విలువలు 3.జాతీయ విద్యా విధానం ప్రభుత్వ విద్య పై ప్రభావం మొదలగు అంశాలపై విషయ వివరణ చర్చ ద్వారా అవగాహన కలగజేస్తారు
ఈ మహాసభలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎమ్మెల్సీ గారు కుందూరి రఘువీర్ రెడ్డి ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు ఎమ్మెల్యేలు కే జంగయ్య టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు హాజరవుతున్నారు కావున ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ సీనియర్ నాయకులు నరసింహ రావు గారు
జిల్లా కోశాధికారి కార్యదర్శులు సాయి గౌతమ్,బాలయ్య,నాంపల్లి, శ్రీహరి,నరేందర్, రత్నం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు