కలిగిరి, నవంబర్ 09, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు):

కలిగిరి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రపంచం మెచ్చిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు ఘన విజయం సాధించి కూటమి సత్తా చాటారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన తొలి పరీక్షలో టీడీపీ అభ్యర్థులు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా అందులో 9 ఎంపీటీసీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ నాయకత్వంలో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో , ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు ప్రజల్లో విశ్వాసాన్ని నింపాయి. దీంతో ప్రజలు కూటమి అభ్యర్థులకు అఖండ మెజారిటీతో పట్టం కట్టారు.13 స్థానాలకు గాను 9 చోట్ల టీడీపీ పసుపు జెండా ఎగురవేయడం మండల రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విజయం రాబోయే పంచాయతీ ఎన్నికలకు కూటమికి మరింత బలాన్ని ఇచ్చిందని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గెలుపొందిన 9 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు తమను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ గెలిచిన 9 స్థానాలు:
గంగిరెడ్డిపాలెం, తెల్లపాడు, కృష్ణారెడ్డిపాలెం, చిన అన్నలూరు, క్రాకుటూరు, లక్ష్మీపురం, వెలగపాడు, అనంతపురం, గుడ్లదోన-ఈస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *