రేణిగుంట_ 3 వ సెగ్మెంట్ ఎంపీటీసీ గా పోటీ చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి బలిపంగి భారతి అనునిత్యం మహిళా సమస్యలు, మద్యం షాపులకు వ్యతిరేకంగా స్థానిక ప్రజా సమస్యలపైన పోరాడుతూ.. ప్రశ్నించే సిపిఎం పార్టీ అభ్యర్థికే ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, సమాజం మార్పు కోసం, బహుజనులు, మైనార్టీ, మధ్యతరగతి, కార్మికుడి పక్షాన పోరాడే ఎర్రజెండా సిపిఎం పార్టీ “సుత్తి, కొడవలి, నక్షత్రం” గుర్తుకు ఓటేసి గెలిపించాలని రేణిగుంట సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ ఓటరు మహాసేయులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నాడు సిపిఎం పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఎన్. రాజేశ్వరి నాయకత్వంలో వినాయక నగర్, గౌరీ నగర్, పాంచాలి నగర్, బిస్మిల్లా నగర్, వివేకానంద కాలనీ నందు ఎన్నికల “ప్రచారం ర్యాలీ” నిర్వహించారు. సిపిఎం పార్టీ అభ్యర్థి, కార్యకర్తలు, ఇంటింటికి తిరిగి దండం పెట్టి తమ ఓటును సిపిఎం పార్టీ గుర్తుకే వేయాలని కోరారు.

మనం ఓటు వేద్దాం _ ప్రజా సమస్యలపై పోరాడే.. ప్రశ్నించే అభ్యర్థికే ఓటు వేద్దాం!

ప్రలోభాలు.. నగదుకు లొంగకుండా.. స్వేచ్ఛగా ఓటేద్దాం!!

వినాయక నగర్, గౌరీ నగర్, పాంచాలి నగర్, బిస్మిల్లా నగర్, వసుంధర నగర్, వివేకానంద కాలనీ ప్రజలారా? ఆలోచించి ఓటెయ్యండి!

మా పోరాటం:


రేణిగుంట అభివృద్ధి కోసం, పేదలకు ఇంటి స్థలాలు కోసం పోరాడే పార్టీ సిపిఎం .
. త్రాగునీరు, అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని పోరాడే పార్టీ సిపిఎం .
ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలి, ఇంటి పన్నులు బారం తగ్గించాలని పోరాడే పార్టీ సిపిఎం .
మద్యం షాపును ఊరు బయటికి తరలించాలని “పాంచాలి నగర్ మహిళా పోరాటం” కు అండగా నిలిచిన పార్టీ సిపిఎం .
గ్యాస్ పెట్రోలు_ డీజిల్_ నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాలని పోరాడిన పార్టీ సిపిఎం .
డ్రగ్స్, గంజాయి, గుండాల, అంతం సిపిఎం పంతం! అనే నినాదం తో “యువత మేలు కోసం” పోరాడిన పార్టీ సిపిఎం అని అందుచేత ఓటర్లు ఆలోచించి పోరాడే పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రేణిగుంట 3వ సెగ్మెంట్ సిపిఎం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బలిపంగి భారతి ఎన్నికల ప్రచారంలో సిపిఎం నాయకత్వం కొండ్రెడ్డి హరినాథ్, ఎన్. రాజేశ్వరి, సీనియర్ నేత వెంకటరమణ, సెల్వరాజ్, రాజశేఖర్, దీప, కుమారి, మునిస్వామి, మహాలక్ష్మమ్మ, తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed