​రేణిగుంట:

తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని ఎంపీడీవో కార్యాలయలో ఈరోజు నిర్వహించిన సమావేశ మందిరంలో ఎంపీడీవో రవిచంద్ర, ఆర్వో ఆదినారాయణల సంయుక్త ఆధ్వర్యంలో ఎంపీటీసీ/జెడ్పీటీసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఎంపీడీవో రవిచంద్ర, ఆర్వో ఆదినారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో (ఎలక్షన్ డ్యూటీ ) ఉన్న అభ్యర్థులు మరియు సిబ్బంది నవంబర్డ 2వ తేదీ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తమ పోస్టల్ బ్యాలెట్లను ఓటు హక్కుగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.

​అలాగే, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వచ్చేవారు తప్పనిసరిగా తమ ఓటర్ ఐడీ కార్డ్ మరియు ఎలక్షన్ డ్యూటీ ఐడీ కార్డ్ రెండింటిని వెంట తీసుకురావాలని అధికారులు తెలియజేశారు. అర్హులైన ఎలక్షన్ డ్యూటీ సిబ్బంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *