కలిగిరి, అక్టోబర్ 16, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వేలగపాడు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం మరియు కౌంటింగ్ కేంద్రాలను ఉన్నతాధికారులు గురువారం క్షుణ్ణంగా పరిశీలించారు.ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కావలి ఆర్డీవో డీ ఎలీషా బాబు డీఎల్ డీవో రమణ మోడల్ స్కూల్ కు విచ్చేశారు. వారితో పాటు కావలి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంఆర్ఓలు, ఇతర ఎన్నికల అధికారులు కలిసి స్ట్రాంగ్ రూం మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు స్ట్రాంగ్ రూం భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా వ్యవస్థ, కౌంటింగ్ హాల్స్ లో టేబుల్స్ ఏర్పాటు, విద్యుత్ సరఫరా, త్రాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం, బారికేడ్ల ఏర్పాటు, పార్కింగ్ స్థలాలు తదితర అంశాలను పరిశీలించారు.అనంతరం ఆర్డీవో డీ ఎలీషా బాబు డీఎల్ డీవో రమణ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం పకడ్బందీగా, పారదర్శకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూం వద్ద 24 గంటల భద్రత ఉండేలా చూడాలని, బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. అలాగే కౌంటింగ్ రోజున సిబ్బందికి, ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని తెలిపారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని, ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ పరిశీలన కార్యక్రమంలో కలిగిరి ఎంపీడీవో ప్రత్యూష, కలిగిరి ఎమ్మార్వో గిరీష్ , కావలి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంఆర్ఓలు, ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *