కలిగిరి, అక్టోబర్ 16, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. మండలంలోని MPTC, సర్పంచ్ స్థానాలకు అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కలిగిరి మండలంలో అత్యంత కీలకమైన కలిగిరి బిట్-2 MPTC స్థానానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుండి యువ నాయకుడు గంగిశెట్టి నాగేంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిజేపీ ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర:కలిగిరి మండలంలో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడంలో గంగిశెట్టి నాగేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ, కేంద్రంలో *ప్రధాని నరేంద్ర మోదీ * నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లడంలో ముందుంటున్నారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు.స్థానికంగా బలమైన మద్దతు:యువకుడిగా, సేవా దృక్పథం కలిగిన నాయకుడిగా గంగిశెట్టి నాగేంద్రకు కలిగిరి బిట్-2 పరిధిలోని గ్రామాల్లో యువత, ప్రజల నుండి విశేష మద్దతు లభిస్తోంది. స్థానిక సమస్యలపై అవగాహన, వాటి పరిష్కారానికి చూపుతున్న చొరవతో ఆయనకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. అందుకే బీజేపీ, ఉదయగిరి నియోజకవర్గం ఇన్చార్జి కదిరి వెంకటరంగరావు సహకారం తో అధిష్టానం కూడా ఈ స్థానానికి ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.బీజేపీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఆశీస్సులతో, ఉదయగిరి నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీ కదిరి వెంకటరంగరావు కలిగిరి మండల బీజేపీ నాయకుల మద్దతుతో కలిగిరి బిట్-2 MPTC గా పోటీ చేసేందుకు గంగిశెట్టి నాగేంద్ర సన్నద్ధమవుతున్నారు. ఒకవేళ పార్టీ తనకు అవకాశం ఇస్తే, కలిగిరి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిధులు తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పిస్తానని, ప్రజా సేవకే అంకితమవుతానని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిపారు.ప్రస్తుతం కలిగిరి బిట్-2 MPTC అభ్యర్థి రేసులో గంగిశెట్టి నాగేంద్ర పేరు ముందు వరుసలో ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కమలం గుర్తుతో ఈసారి కలిగిరిలో సత్తా చాటాలని బీజేపీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
