*కొండాపురం, అక్టోబర్ 16, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు.కొమ్మి MPTC పరిధిలోని కొమ్మి, బీమవరపాడు, రామానుజపురం, కుంకువారిపాలెం గ్రామాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు, బూత్ కన్వీనర్లు,యూనిట్ ఇన్చార్జ్ లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ స్థాయి బలోపేతం, ఓటర్లను చైతన్యపరచడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నాయకులు తమ గ్రామాల్లోని పరిస్థితులను, తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల మాజీ అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రినాయుడు బొంట్లగుంట హరిబాబు మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు.వారు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, అందువల్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో, ఐక్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు. కొమ్మి MPTC పరిధిలోని MPTC అభ్యర్థిని, అలాగే నాలుగు గ్రామాల సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, చంద్రబాబు నాయుడు కి, నారా లోకేష్ కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి బహుమతిగా ఇవ్వాలని కోరారు.అంతేకాకుండా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేస్తూ ప్రతి గడపకు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం, అరాచకాలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును ప్రజలకు తెలియజేసి, వారి మద్దతు కూడగట్టాలని దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్, కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *