*వింజమూరు, అక్టోబర్ 16, మన ధ్యాస ప్రతినిధి, నాగరాజు:*
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, వింజమూరు ప్రాంతంలో విద్యారంగంలో తనదైన ముద్ర వేస్తున్న *శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ & సైనిక్ స్కూల్ అకాడమీ* మరోసారి తన సత్తా చాటింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణం *రాజీవ్ నగర్* లో కొనసాగుతున్న ఈ అకాడమీ విద్యార్థులు *2025-2026 విద్యా సంవత్సరానికి* గాను వెలువడిన నవోదయ, సైనిక్ స్కూల్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.ఈ విద్యా సంవత్సరం ఫలితాలలో ఏకంగా *నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలో 11 సీట్లు, అలాగే జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో 4 ర్యాంకులు* సాధించి వింజమూరు ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు.ఈ ఘన విజయం పట్ల అకాడమీ డైరెక్టర్ *శ్రీ B.S. Raju గారు* హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ అకాడమీలో చేరిన ప్రతి విద్యార్థికి అత్యంత మెరుగైన శిక్షణ, క్రమశిక్షణతో కూడిన బోధన, వ్యక్తిగత శ్రద్ధ, నిరంతర సాధన చేయించడం వల్లనే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని తెలిపారు. పరీక్షల నమూనాకు అనుగుణంగా ప్రత్యేక స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణే తమ విజయ రహస్యమని అన్నారు.సీట్లు, ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, విద్యార్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.*2027 బ్యాచ్ కు అడ్మిషన్లు ప్రారంభం:*
ప్రస్తుతం *నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2027 బ్యాచ్ కు సంబంధించిన Long-Term కోచింగ్ క్లాసులు డిసెంబర్ మొదటి వారం నుండి ప్రారంభం కానున్నాయని, హాస్టల్ సదుపాయం కలదని* నిర్వాహకులు తెలిపారు. తమ పిల్లలను నవోదయ, సైనిక్ స్కూల్ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలలో చేర్పించాలనుకునే తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మరిన్ని వివరాలకు, అడ్మిషన్ల కొరకు *7382214380* నంబర్ ను సంప్రదించాలని అకాడమీ నిర్వాహకులు తెలిపారు.