​శ్రీకాళహస్తిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘గ్రీవెన్స్’ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించినట్లు స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను సానుకూలంగా వింటూ, వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. “నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే నా బాధ్యత” అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి నా వంతు పూర్తి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *