మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు & బాలల భద్రత, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ . సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డి.ఎస్.పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో, గాజులమండ్యం సీఐ మంజునాథరెడ్డి మరియు గాజులమండ్యం ఎస్సై హరీష ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఎల్లమండ్యం గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు గ్రామ ప్రజలతో సమావేశమై, సమాజ భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ముఖ్యంగా యువతపై పడే ప్రతికూల ప్రభావం గురించి ప్రజలకు వివరించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలపై సమాచారం తెలిసినప్పుడు పోలీసులకు తెలియజేసి, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

మహిళలు మరియు బాలల భద్రత

మహిళలు, బాలలపై జరిగే నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలల భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళలు మరియు బాలల రక్షణ కోసం అందుబాటులో ఉన్న పోలీసు సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

రోడ్డు భద్రతపై అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసు అధికారులు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకపోవడం వంటి భద్రతా చర్యలను పాటించాలని వివరించారు.

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు మరియు బాలల రక్షణ కోసం పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం. నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *