రేణిగుంట.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తారక రామానగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయ ప్రాంగణంలో మొదటిసారిగా శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ గణపతి యూత్ (ఖుషి, బబ్లు) సౌజన్యంతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
​ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ రవీంద్ర, కార్యదర్శి కృష్ణమూర్తి, ట్రెజరర్ లక్ష్మమ్మ, ఆలయ సలహాదారు రామ తులసి ప్రత్యేక ఆహ్వానం పలకగా… ముఖ్య అతిథులుగా కాణిపాకం వినాయక బాబు (మధు), సుబ్రమణ్యం ఆచారి, కోటి, నాగరాజు తదితరులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
​వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
​ప్రత్యేక ఆకర్షణగా చిన్నారుల పోటీలు:
ఈ వేడుకల్లో భాగంగా చిన్నారుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రధానం చేశారు. చిన్నారుల సందడి, ఉత్సాహంతో ఆలయ ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.
​లంబోదరుని దర్శనార్థం స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు బారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులను, యూత్ సభ్యులను అభినందించారు.
​ఈ వేడుకలు దిగ్విజయంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులతో పాటు స్థానికులు, గ్రామ పెద్దలు పూర్తి సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో దిలీప్, ఖుషి, బబ్లు, శ్రావణ్, మోక్షి, లక్కీ, గణి, దేవ, మిధున్ మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *