కొండాపురం, సెప్టెంబర్ 04, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో యాదవ్ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ హాజరై గ్రామ నాయకులు తో ప్రజలతో కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ట్రస్ట్ తరఫున కార్యక్రమానికి ఆర్థిక సాయం చేశారు. ప్రతి సంవత్సరం కొమ్మి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు ఇలాగే జరగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య, బూత్ ఇంచార్జీ చెరుకూరి శేషయ్య,గుమ్మ శివ,విష్ణు,హరి కృష్ణా,అంబటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *