రేణిగుంట సెప్టెంబర్ 4.

జగన్నాథుడు, అవతారమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ వారి జన్మాష్టమి వేడుకలు అంబేద్కర్ స్టార్ కృష్ణ ఆధ్వర్యంలో , రేణిగుంట మండలం, జీపాలెం గ్రామంలో వెలసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణులవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, స్టార్ కృష్ణ, వారి కుమార్తె డాక్టర్ నీల కృష్ణవేణి మరియు అల్లుడు ప్రవీణ్ కుమార్ పేరుమీదుగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తరువాత తిరుపతి తిరుమల దేవస్థానం వారి ధర్మ ప్రచార పరిషత్ వారి తరఫన రాధిక చే అద్భుతంగా కచేరి నిర్వహించారు. సాయంత్రం టి.టి.డి. వారి అన్నమయ్య ప్రాజెక్టు వారి తరఫన హరికథా గాన కాలక్షేపము జరిగింది. అంతకు మునుపు స్టార్ కృష్ణ దంపతులు కార్వేటినగరం లోని, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేసి, స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకొన్నారు. జీపాలెంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలలో టి.టి.డి.రిటైర్డ్ ఎంప్లాయీ సాంబశివ, రాజశేఖర్, చెంగలరాయులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కృష్ణాష్టమి వేడుకలు ఆనందంగా జరుపుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *