తిరుపతి ఐఐటీలో జాతీయ స్థాయి అవార్డులు కైవసం.

సైన్స్ ప్రదర్శనలో ప్రథమ బహుమతి, క్విజ్ పోటీలలో ద్వితీయ మరియు తృతీయ బహుమతులు సాధన..

రేణిగుంట ఆగష్టు 15.
​రేణిగుంటలోని ఖాన్-రెయిన్‌బో పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్ మరియు క్విజ్ పోటీలలో తమ ప్రతిభను చాటి ఘన విజయం సాధించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో నిర్వహించిన వర్కింగ్ మోడల్ ప్రదర్శన మరియు క్విజ్ పోటీలలో ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఇస్రో-షార్), జాతీయ వాతావరణ పరిశోధనా ప్రయోగశాల (ఎన్ఏఆర్ఎల్) మరియు తిరుపతి ఐఐటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
​ఆగస్టు 15న నిర్వహించిన ప్రదర్శన పోటీలలో పాఠశాల విద్యార్థులు తయారు చేసిన సైన్స్ వర్కింగ్ మోడల్ ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, తీవ్ర పోటీ నడుమ జరిగిన క్విజ్ పోటీలలో సైతం విద్యార్థులు ద్వితీయ మరియు తృతీయ బహుమతులను సాధించి పాఠశాల ప్రతిష్టను నిలబెట్టారు. అంతరిక్ష పరిశోధనా సంస్థల ప్రతినిధుల సమక్షంలో విజేతలకు బహుమతులు మరియు ప్రశంసాపత్రాలు అందజేశారు.
​విద్యార్థుల సృజనాత్మకత, శాస్త్రీయ పరిజ్ఞానానికి ఈ విజయాలు నిదర్శనమని తెలుపుతూ, విజేతలైన విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను మరియు తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *