80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సత్కరించిన ఈఈ గంగాధర్ రెడ్డి.
రేణిగుంట ఆగష్టు 15. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిడిసిఎల్) రేణిగుంటలో లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న బాలసుబ్రమణ్యం ఉత్తమ లైన్‌మ్యాన్ అవార్డును అందుకున్నారు. శనివారం తిరుపతిలో అత్యంత వేడుకగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా, విధుల్లో చూపిన ప్రతిభకు గాను ఆయనను విద్యుత్ శాఖ ఈఈ (ఆపరేషన్స్) గంగాధర్ రెడ్డి మెమొంటో మరియు ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఉత్తమ లైన్‌మ్యాన్ అవార్డు గ్రహీత బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ, ఈ పురస్కారాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తన విధి నిర్వహణలో అనునిత్యం ప్రోత్సహిస్తూ ఈ అవార్డు రావడానికి సహకరించిన డిప్యూటీ ఈఈ రమేష్, రేణిగుంట సెక్షన్ అధికారి పుణ్యకోటిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
