కొండ్రెడ్డి ఈశ్వరమ్మ , ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డిమాండ్!
రేణిగుంట ఆగష్టు 15.
80వ స్వాతంత్ర దినోత్సవ నాడు జాతీయ జెండా స్ఫూర్తితో.. రేణిగుంట పాంచాలి నగర్ లో 8వ రోజు “వీధి నిరసనలు” భాగంగా జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం మహాత్మా గాంధీ నేర్పిన అహింస పద్ధతిలో శాంతియుతంగా “వీధి నిరసనలు” తెలిపారు.
ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ మాట్లాడుతూ..రేణిగుంట పాంచాలినగర్ లో స్థానిక మహిళలు కలిసి శాంతియుతంగా చేపట్టిన “వీధి నిరసనలు” 8 రోజులు అవుతున్న సంబంధిత ఎక్సైజ్ శాఖ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. రేణిగుంట పట్టణం నుండి ఊరు బయటకి “ఆద్య వైన్స్ _ సర్వీస్ వైన్స్” మద్యం షాపులు తొలగిస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే హామీ ఇచ్చే అంతవరకు పాంచాలినగర్ లో చేపట్టిన “వీధి నిరసనలు” ఆపేది లేదని దశల వారి మద్యం వ్యతిరేక పోరాటానికి మహిళా సంఘం సిద్ధమవుతామని హెచ్చరించారు.
రేణిగుంట పట్టణం లో “ఆధ్యా వైన్ షాప్ _ సర్వేశ్ వైన్ షాప్”లు బడి, గుడి, జన నివాస ప్రాంతం, బస్ స్టాపింగ్, వంటి ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా పెట్టారు అని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ తెలిపారు. ఈనెల 17, 18, 19న తేదీల్లో జరిగే రేణిగుంట శ్రీ గంగమ్మ జాతర సందర్భంగా గుడికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఈ మద్యం దుకాణాలు తెరిచి ఉన్నాయని జాతర పూర్తయ్యే వరకు మూడు రోజులు రేణిగుంట పట్టణంలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. రేణిగుంట నుండి ఊరు బయటకి మద్యం దుకాణాలను తరలించేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిరసనకు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ, ఐద్వా మండల అధ్యక్షురాలు భారతి, పద్మమ్మ, రేణిగుంట మద్యం వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి పద్మావతి, సిపిఎం పార్టీ రేణిగుంట ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కె. హరినాథ్,
స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.
