​పింఛన్ పంపిణీతో పాటు స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే ఆరా!..
తొట్టంబేడు ఆగష్టు 1.
తొట్టంబేడు మండలం, పిల్లమేడు గ్రామం నందు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు.*
ఉదయాన్నే గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే , లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారి చేతులకు పింఛన్ డబ్బులను అందించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం:
అర్హులైన ప్రతి ఒక్కరికీ /నెల మొదటి రోజే పింఛన్ అందించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
లబ్ధిదారుల ఆనందం:
వివృద్ధులు, వికలాంగులు, మరియు పింఛన్ దారులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
స్థానిక సమస్యలపై ఆరా:
పింఛన్ పంపిణీ అనంతరం గ్రామంలోని ప్రజా సమస్యలను, తాగునీరు, రోడ్లు వంటి వసతుల గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, మరియు కూటమి నాయకులు,సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *