తిరుపతి జులై 16.
కూటమి నాయకులు తిరుపతి నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా, ప్రముఖ దాత దివంగత వి. వెంకట ముని శెట్టి జ్ఞాపకార్థం తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్‌లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని, రిబ్బన్ కట్ చేసి బస్ షెల్టర్‌ ను ప్రజల వినియోగం కోసం అంకితం చేశారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ: తిరుపతి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం సామాజిక బాధ్యతతో వి. వెంకట ముని శెట్టి స్మారకార్థం ఈ నూతన బస్ షెల్టర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారుఈ కార్యక్రమంలో తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, తెదేపా తిరుపతి ఇంచార్జి జేబీ శ్రీనివాస్, గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు కూటమి నాయకులు కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed