శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, శివభక్తులకు ఇది ఎంతో గర్వకారణమైన శుభసమయం! తిరుమల మినహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల కంటే మన శ్రీకాళహస్తి దేవస్థానం 75.8% పాజిటివ్ రేటింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రథమ స్థానంలో నిలిచింది.*
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శక పాలన, దళారీ రహిత వ్యవస్థే ఈ చారిత్రాత్మక విజయానికి ప్రధాన కారణం. భక్తులకు కల్పించిన మెరుగైన వసతులు, పవిత్రమైన వాతావరణం మన ఆలయ కీర్తిని మరింత ఇనుమడింపజేశాయి.
ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, భక్తుల నమ్మకమే శ్రీకాళహస్తి ప్రగతికి అసలైన మూలస్తంభం. దేవస్థాన అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు, పాలకమండలికి, ఆలయ అధికారులకు, అర్చకులకు మరియు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మన ఆలయాన్ని ఆధ్యాత్మికంగా మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేద్దాం!
