రేణిగుంట మే 23.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం లో మహిళా భద్రత మరియు రక్షణ పట్ల మరింత అవగాహన కల్పించే దిశగా గాజులమండ్యం పరిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి జిల్లా పోలీస్ సూపర్డెంట్ ఎల్. సుబ్బరాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా గాజులమండ్యం సబ్ ఇన్స్పెక్టర్ హరీష ఎస్పీ కి పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి పోలీస్ శాఖ తీసుకున్న కఠిన చర్యల గురించి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటు చేశారు.ఆపద సమయాలలో మహిళలు పోలీసుల సహాయం ఎలా పొందాలి, అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్, ప్రభుత్వం అందిస్తున్న వివిధ రక్షణ యాప్ల వినియోగం తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో అధికారులు ప్రధానంగా చర్చించారు. మహిళా భద్రత పట్ల పోలీసులను భద్రతను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో స్థానిక పోలీస్ సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు చురుకుగాపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed