తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తుడా కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తుడా వైస్ చైర్మన్, సెక్రటరీ మరియు ఇతర ఉన్నతాధికారులు చైర్మన్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
తుడా అభివృద్ధిలో మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తుడా చైర్మన్ అందిస్తున్న నాయకత్వాన్ని అధికారులు ఈ సందర్భంగా కొనియాడారు.
తుడా వైస్ చైర్మన్, సెక్రటరీ చైర్మన్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు వ్యక్తపరిచారు.
తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తుడా మరిన్ని మైలురాళ్ళను అధిగమించాలని వారు ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో భాగంగా తుడా ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చారు.
తుడా చైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు మద్దతుగా, డాలర్స్ చారిటబుల్ ట్రస్టుకు ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు మరియు సిబ్బంది కలిసి బియ్యాన్ని బహుకరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా తుడా సాధించిన ప్రగతికి అధికారుల, సిబ్బంది సమష్టి కృషే కారణమని పేర్కొన్నారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి, సదుద్దేశంతో ట్రస్టుకు విరాళం అందించిన ఇంజనీరింగ్ అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తుడాకు చెందిన అన్ని విభాగాల అధికారులు,ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


