మన ధ్యాస, నెల్లూరు,జనవరి 9 :మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ముగ్గుల పోటీలు చక్కని వేదికగా ఉపయోగపడతాయని మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. హిందూ సంస్కృతిలో సంక్రాంతి విశిష్టమైన పండుగని, ఈ పండుగ సందర్భంగా వేసే ముగ్గుల్లో సృజనాత్మకత దాగి ఉంటుందని చెప్పారు. నెల్లూరు నగరంలోని సంతపేట 49వ డివిజన్ యనమలవారి వీధి లో ప్రతి ఏటా ముగ్గులపోటీలు విజయవంతంగా నిర్వహిస్తూ మహిళలల్లో సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తి కలిగేలా కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. తెలుగువారు ఎక్కడున్నా సంస్కృతికి, సంప్రదాయాలకు పట్టం కడతారని, ఆ స్ఫూర్తిని ఈ పోటీల్లోనూ మహిళలు చాటుకున్నారని ప్రశంసించారు. డివిజన్ కు వచ్చిన రమాదేవికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. మహాలక్ష్మమ్మ ఆలయంలో రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పొంగురు రమాదేవి మాట్లాడుతూ….. నెల్లూరు ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.ఈ రంగవల్లుల్ల పోటీలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారన్నారు.మహిళలు పోటీలు పడివేసిన రంగువల్లులను రమాదేవి తిలకించారు.మొదటి ,ద్వితీయ ,తృతీయ స్థానాల్లో నిలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేసారు.సంక్రాంతి అంటేనే ముగ్గులతో ప్రారంభమౌతుందన్నారు .ఈ ప్రాంత గుడికి విరాళం ఇచ్చి ప్రారంభోత్సవానికి అప్పట్లో వచ్చానన్నారు.అప్పటి నుంచి ఇక్కడ జరిగే ముగ్గుల పోటీకి ముఖ్యఅతిధిగా హాజరవుతున్నానని. 15 సంవత్సరాలుగా ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ముగ్గుల పోటీలు నిర్వహిస్తుందన్నారు.సంక్రాంతి చిహ్నాలతో కూడిన ముగ్గులు అబ్బురపరిచాయని..రంగుల కూర్పు లో మహిళలు ప్రతిభ కనబరిచారని..సంక్రాంతికి ప్రతీ ఒక్కరికీ సకల సౌఖ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, డివిజన్ అధ్యక్షుడు ఖాదర్ బాషా, వైస్ ప్రెసెండెంట్ నారా శ్రీనివాసులు నాయుడు, స్థానిక టిడిపి ముఖ్యనేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.







