మహిళలకు మెరుగైన ఆరోగ్యం పౌష్టిక ఆహారంతోనే..

  • – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- మహిళలకు మెరుగైన ఆరోగ్యం, పౌష్టిక ఆహారాలపై అవగాహన కల్పించడం అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా భావించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ సూచించారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వర్తక సంఘం కళ్యాణ మండపం లో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలు మరియు అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభ హాజరు అయ్యారు.. ముందుగా జ్యోతి ప్రజాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, పౌష్టికాహారం బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అత్యంత అవసరమని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది అన్నారు. పౌష్టికాహారం ప్రాముఖ్యతను పురుషులు కూడా అర్థం చేసుకోవాలని, వారు కుటుంబ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఊబకాయం మరియు రక్తహీనత వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సరైన ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. సాంకేతిక యుగంలో ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్‌ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, సంప్రదాయ బలవర్ధక ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.అనంతరం కాకినాడ జిల్లా శిశు సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ, పౌష్టికాహారం మహోత్సవంలో భాగంగా మహిళలు అవగాహన కలిగి మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని లేదంటే అనారోగ్యాలకు గురై ఆసుపత్రికి లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపారు. ప్రతి కుటుంబంలోనూ మహిళల ఆరోగ్యం ఆ కుటుంబానికి రక్ష అని సూచించారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మహిళలకు మరింతగా అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అంగన్వాడి ప్రాజెక్టు అధికారులకు ఆదేశించారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు పర్వత సురేష్, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వెన్న శివ, ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) జనసేన పార్టీ శంఖవరం మండల అధ్యక్షుడు గాబు సుభాష్, తదితరులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతిపాడు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేస్తుందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు.అనంతరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నియోజక వర్గ స్థాయిలో జరిగిన వ్యాస రచన , ఆటల పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు ప్రధానం చేశారు. ఆటలు , వ్యాస రచన వంటి పోటీల ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆమె అన్నారు. ప్రతీ బాలిక ఉన్నత విద్య అభ్యసించి, ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఆమె కోరారు..ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు శంకవరం ప్రాజెక్ట్ అధికారి పర్వత వెంకటలక్ష్మి, ప్రత్తిపాడు ప్రాజెక్టు అధికారి పద్మావతి,జిల్లా బాలల పరిరక్షణ విభాగ ప్రొటెక్షన్ అధికారిని జాగరపు విజయ, ఐసిడిఎస్ నాలుగు మండలాల సూపర్వైజర్లు ప్రాజెక్ట్ ఉద్యోగులు,ఎన్డీఏ కూటమి శ్రేణులు, అంగన్వాడి కార్యకర్తలు , అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు..

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!