ఉదయగిరి, అక్టోబర్ 07 :(మన ధ్యాస న్యూస్)

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. వెంకటరావుపల్లి “‘జి ఎస్ టీ -2.0 పై అవగాహన సూపర్ జి ఎస్ టీ -సూపర్ సేవింగ్స్ ఈరోజు ఉదయగిరి మండల విద్యాశాఖాధికారి తోట. శ్రీనివాసులు , పాఠశాల హెచ్ ఎమ్ చల్లా. వెంకటేశ్వర్లు , ఆధ్వర్యంలో జి ఎస్ టీ, సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్థాయిలో భాగంగా “”సూపర్ జి ఎస్ టి – సూపర్ సేవింగ్స్”‘ అంశంపై విద్యార్థులకు కాంపిటీషన్స్ నిర్వహించుటకు సూచించారు..ఇందులో భాగంగా భారతదేశంలో జి ఎస్ టీ, అభివృద్ధి ఆలోచనల నుండి అమలు విధానము, జి ఎస్ టీ నిర్మాణం మరియు లక్షణాలు, భారత ఆర్థిక వ్యవస్థ పై జి ఎస్ టీ ప్రభావము,జి ఎస్ టి అమలులో లాభాలు మరియు సవాళ్లు, భారత ఆర్థిక వ్యవస్థను ప్రామాణికరించడం లో జీఎస్టీ పాత్ర, జి ఎస్ టి, పన్ను పరిధి సరళీకరణ విధానం, సామాన్య ప్రజలకు జి ఎస్ టి 2.0 ఉపశమనం, జి ఎస్ టి,సాంకేతిక పరిష్కారాల వినియోగం, AI ఆధారిత మోసాల గుర్తింపు, అంశాలపై అవగహన కల్పించడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల స్టాప్ మెంబెర్స్ పాల్గొన్నారు.