
వరికుంటపాడు, అక్టోబర్ 2:(మన ధ్యాస న్యూస్ ):////
దశరా బోనస్ గా ప్రభుత్వ భూమిని దానం చేస్తున్న రామాపురం వి ఆర్ వో మహేశ్వరరావు.
వరికుంటపాడు మండలం రామాపురం పంచాయతీలో ఎస్సీ కాలనీలోని వీఆర్వో వసూలు కీ అలవాటు పడి, చెన్నై లో స్థిర నివాసం కలిగి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ తరతరాలుగా అక్కడే ఉన్న కొన్ని కుటుంబాలవారు రామాపురం పంచాయతీ లోని ఎస్ సి కాలనీ లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ళు నిర్మిస్తూ ఒక్కొక్కరు పదిహేను సెంట్లు చొప్పున ఆక్రమించుకోగా గ్రామస్తులు విఆర్వో మహేశ్వరరావు, వి ఆర్ ఎ హుస్సేన్, లకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితంలేదని. అక్రమ నిర్మాణాలు ఆపకుండా తాను ఉద్యోగ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారితో చేతులు కలిపి దశరా మామూలు కింద గ్రామం లో లేని వారికి భూములు పంచిస్తున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు.అంతే కాకుండా ఆ గ్రామంలో ని తెలుగుదేశం పార్టీ వారికి ఆ విఆర్వో ఒక్క పనికూడా చేయకుండా గ్రామంలోని వైసిపి వారితో స్నేహం చేస్తూ పైసా వసూల్ అంటున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు.ఈ విషయం పై తనమీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయబోతున్నామని మీడియా కి తెలిపారు.