ప్రతి సంవత్సరం 8 కోట్లు రూపాయలు ప్రజలకు ఆదా..!

వింజమూరు అక్టోబర్ 1 :(మన ధ్యాస న్యూస్):////

ప్రగతి పథంలో డబల్ ఇంజన్ ప్రభుత్వం నడుస్తుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. బుధవారం వింజమూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ నుండి కొత్త బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ టాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు.

అంతకుముందు బస్టాండ్ సెంటర్లోని జిఎం హోమ్ నీడ్స్, మరియు మెడికల్ షాపుల వద్దకు వెళ్లి షాపు యజమానులతో మాట్లాడారు.సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వారి ద్వారా మీడియాకు వివరించారు. అనంతరం టాక్టర్ పై విక్టరీ చూపుతో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నలకు, షుగర్, బిపి,కిడ్నీ, మరియు గుండె కు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు సూపర్ జీఎస్టీ ద్వారా మందుల ధరలు భారీగా తగ్గాయి అన్నారు. అదేవిధంగా రైతన్నల రైతు రథం టాక్టర్ పై ఒక్క లక్ష 20వేల రూపాయలు తగ్గినట్లు తెలియజేశారు. గతంలో ఉన్న 18 శాతాన్ని ఐదు శాతం వరకు జీఎస్టీ తగ్గించి లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నెత్తిన భారం లేకుండా, లబ్ధిని చేకూర్చింది అని తెలిపారు. ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నప్పటికీ, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను నేరుగా అమలు పరుస్తున్నారని తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రుణపడి ఉన్నారన్నారు. ముఖ్యంగా జిఎస్టి 20 తో నిత్వసరాలు ఔషధాలు స్టేషనరీ వస్త్రాలు క్రీడా వస్తువులు రవాణా మహిళలకు చిన్నారులకు సంబంధించిన వస్తువులపై జీఎస్టీ భారీగా తగ్గిందన్నారు.

అంతేకాకుండా వ్యవసాయ పరికరాలు ఎం ఎస్ ఎమ్ ఇల్లు, చేనేత ఉత్పత్తులు, ఆక్వా, విద్యారంగం, బీమా, ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్, భవన నిర్మాణ రంగం ,టూరిజం ,ఆదిత్య రంగం, రవాణా, లాజిస్టిక్ క్రీడా పరికరాలు, విద్యుత్, ఆటోమొబైల్, తదితర వాటిపై జిఎస్టి తగ్గిందన్నారు. కనుక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు యాదవ్, సర్పంచ్ నల్లగొండ సృజన, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, గువ్వల కృష్ణారెడ్డి,మంచాల శ్రీనివాసులు నాయుడు , యారవ కృష్ణయ్య, పోలినేని చంద్రబాబు నాయుడు, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, పాములపాటి మాల్యాద్రి, గురజాల వెంకటరమణయ్య, గురజాల వాసు నాయుడు, బిజెపి మండల కన్వీనర్ డేగా మధు యాదవ్, జనసేన మండల కన్వీనర్ బండారు సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసులు, కటకం లక్ష్మీ ప్రసన్న, గంగ పట్ల హజరత్, నూతల పాటి జయలక్ష్మి, దుద్దుగుంట శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి, తిరుపతి ఆచారి, ఎస్కే బాదుల్లా,ఏ డి ఏ శేషగిరిరావు, ఏవో వాసు, ఉద్యాన శాఖ అధికారి, ఎస్.కె సాహిల్, పంచాయతీ కార్యదర్శి రామారావు, కలిగిరి సీఐ వెంకటనారాయణ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *