ఉదయగిరి సెప్టెంబర్ 16 :(మన ద్యాస న్యూస్) :
నియోజకవర్గ అభివృద్ధి పట్ల అహర్నిశలు శ్రమిస్తూ, పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేస్తున్న ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ప్రజలకు అండగా నిలుస్తున్నారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటూ, ప్రజా సేవలో నిరంతరం కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో చిన్న సమస్యనైనా పెద్ద సమస్యనైనా సమానంగా పరిగణించి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిష్కారం చూపడం ఆయన ధ్యేయంగా మారింది.ఉదయగిరి ప్రజల అండతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాకుండా, ప్రతి కుటుంబానికి చేరువై వారి సంతోషం, భద్రత కోసం ఎప్పుడూ కృషి చేస్తూ “ప్రజల ప్రతినిధి ”గా నిలుస్తున్నారని ప్రజలు అభినందిస్తున్నారు.