కలిగిరి మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 15 :

కలిగిరి పోలీస్ స్టేషన్ నందు ఎస్సై ఉమాశంకర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉమా శంకర్, మొదటగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ స్వాతంత్రం సాధించడం కోసం వారు పడిన శ్రమలను మరియు అర్పించిన ప్రాణ త్యాగాలను గురించి వివరించారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దేశభక్తిని భావితరాలకు అందించే దిశగా సమిష్యగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలిగిరి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *