


నిజాంసాగర్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో గంగాధర్ సూచనలు జారీ చేశారు. రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు హెడ్‌క్వార్టర్‌లోనే ఉండి, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎలాంటి నష్టాలు జరగకుండా సమయానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.తర్వాత ఆయన మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని, ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి చాకలి అంజయ్యకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బిక్షపతి, ఎస్ఐ శివకుమార్,ఎంఈఓ తిరుపతిరెడ్డి,నీటి పారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్, తదితరులు ఉన్నారు.
