

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట ప్రధాన కూడలి డాక్టర్ వైయస్సార్ విగ్రహం వద్ద మాజీ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి విజయానందరెడ్డి జన్మదిన వేడుకలు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్యామ్ ఆధ్వర్యంలో బాణా సంచాల నడుమ, యువతీ యువకుల మేళాతాళాల నడుమ చిందులేస్తూ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా క్రియాశీలక కార్యదర్శి విజయబాబు మాట్లాడుతూ…. ఎం సి విజయానంద రెడ్డి మన గ్రామంలో పుట్టడం మన అదృష్టమని, మన గ్రామ కీర్తి ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భవం రోజు నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ… ప్రతిపక్షాలు అక్రమ కేసులకు బెదరకుండా వైఎస్ఆర్సిపి పార్టీ నీ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారన్నారు. గ్రామస్థాయిలో అతను చేసిన సేవలు నేడు మన కళ్ళు ముందు ఉన్నాయన్నారు. మరికొందరు నాయకులు విజయానంద రెడ్డి సేవలను కొనియాడారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమా మండల కన్వీనర్ మణి, ఎంపీపీ సరితా జనార్ధన్, ఎంపీటీసీ సభ్యులు కోటిరెడ్డి బాబు,జిల్లా క్రియాశీలక కార్యదర్శి కుప్పయ్య, నియోజకవర్గం సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నాగమణి,నాయకులు సుధా, మణి,యుగంధర్, శేషాద్రి, మార్ కొండయ్య, గోవింద్ రెడ్డి, హరి రెడ్డి, దొరస్వామి, మాధవ, చంద్రారెడ్డి, మహేష్, రఘు, భరత్, నేలమ్మ, ఆబురు, తదితరులు పాల్గొన్నారు.