జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పెరటి తోటలపై శిక్షణ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మండలంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డిపిఎం) జె.ఎలియాజర్ ఆధ్వర్యంలో రింగ్స్ లో పెరటి తోట ను పెంచే విధానంపై శిక్షణను ఇచ్చారు. ఇంటి వద్ద ఖాళీ ప్రదేశంలో రింగులు ఏర్పాటు చేసుకొని ఇసుక, ఘనజీవామృతం, కోకో పిట్, బయోచార్, మట్టి ని ఉపయోగించి శాశ్వత పెరటి తోటను తయారు చేసుకునే విధానంపై రైతులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన పోషకాలు గల ఆహారం లభిస్తుందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఇంటి వద్దనే రింగ్స్ లో పెరటి తోటలు వేసుకుని నాణ్యమైన పోషకాలు కలిగిన కూరగాయలు, ఆకుకూరలు పొందవచ్చునని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆకుకూరలు, కూరగాయలు తినడం వలన రోగాల బారిన పడకుండా మనిషి ఆరోగ్యంగా ఉండవచ్చునని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం చేకూరుతుందని అన్నారు. ఎన్ ఎఫ్ ఏ నాయుడు మాట్లాడుతూ ప్రతి మానవునికి ముఖ్యంగా కావలసింది ఆరోగ్యం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలను తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. మాస్టర్ ట్రైనర్ (యమ్ టి) మజ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రకృతి వ్యవసాయం ద్వారా కావలసిన ఆకుకూరలు, కూరగాయలను పెరటి తోటల ద్వారా ఇంటి వద్దనే పండించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, మనతో పాటు మన పిల్లలు, తర్వాత తరాల వారు కూడా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. జిల్లా కోఆర్డినేటర్ గణేష్ మాట్లాడుతూ అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు కెమికల్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా సంవత్సరం అంతా ఇంటి వద్దనే ఏ విధంగా పండించు కోవాలనేది రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు,జిల్లా కోఆర్డినేటర్ గణేష్,యూనిట్ ఇన్చార్జి బీవీవీ సత్యనారాయణ, ఏసుబాబు,బూరమ్మ,వెంకటలక్ష్మి,రాజారత్నం,బాలయ్య గౌరీ,కృష్ణ అర్జున,దేవి,చిన్నబాబు మండల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు