మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్
:పట్టణంలోని స్థానిక కృష్ణాలయం వీధి అర్బన్ పీహెచ్సీలో ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఎం సౌభాగ్య సరోజ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆస్పత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వైద్యురాలు సౌభాగ్య సరోజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రత పాటించాలని, బ్రీడింగ్ సోర్సెస్ ని గుర్తించి దోమలు అభివృద్ధి చెందకుండా చూడాలని, హుండీలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఫ్రైడే ని డ్రై డే గా పాటించాలని, ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నెలలు లేకుండా ఎప్పటికప్పుడు వాటిని తొలగించాలని ఆమె అన్నారు. అనంతరం డెంగ్యూ సబ్ యూనిట్ ఆఫీసర్ ఆనంద్ మాట్లాడుతూ డెంగ్యూ అనేది వైరల్ ఫీవర్ అని, ఇది పిడిస్ అనే దోమ కాటు వల్ల వ్యాప్తిస్తుందని, ఈ దోమ పగటిపూట పుడుతుందని అన్నారు. అంతేకాకుండా ఇది ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ పడిపోయి రోగి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని, కాబట్టి దాము వృద్ధి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఎస్ విజయలక్ష్మి, స్టాఫ్ నర్స్ వి సూర్యకాంతం, ఫార్మసిస్ట్ కే మణికుమార్,డీఈవో సాయి దర్శన్,ల్యాబ్ టెక్నీషియన్ జ్యోతి,ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *