సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయక శాఖ మంత్రివర్యులు ఆనం రామ నారాయణరెడ్డి రెడ్డి

‌. మన న్యూస్, ఆత్మకూరు ,మే 11: ఆత్మకూరు నియోజకవర్గంలో 22 మంది లబ్ధిదారులకు 37 లక్షల 25వేల 213 రూపాయలు చెక్కుల రూపంలో అందజేసిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఆత్మకూరు మండలంలో ఆరుగురికి, మర్రిపాడు లో నలుగురికి, ఏఎస్ పేటలో ఒకరికి, అనంతసాగరంలో ముగ్గురికి, చేజర్ల మండలంలో ఐదుగురికి ఇతరులకు రెండు చెక్కులు అందజేసిన మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 205 కుటుంబాలకు 2 కోట్ల 60 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశాం.ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా పథకం వర్తించని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశాం అని అన్నారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నెల్లూరు జిల్లా నాన్ డెల్టా లో కూడా రెండో పంటకు సాగునీరు ఇస్తున్నాం అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం రెండవ పంటకు డెల్టాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు, నాన్ డెల్టా కింద 1,64,000 ఎకరాలకు, తెలుగు గంగ ప్రాజెక్టు కింద 1,60,000 ఎకరాలకు. రబీ పంటకు మొత్తం 5.24 లక్షల ఎకరాలు సాగునీరు అందించడం జరుగుతుంది అని అన్నారు.గత 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో అత్యధికంగా 1,80,000 ఎకరాలకు మాత్రమే రెండవ పంటకు నీరు ఇవ్వగలిగాం. కానీ ఈ ఏడాది 5.24 లక్షల ఎకరాలకు అందిస్తున్నాం అని అన్నారు. సోమశిల ప్రాజెక్టు మరమ్మత్తులకు నిధులు విడుదల చేయాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అని అన్నారు. కొత్త షెటర్లు, రోప్లు, గ్రీజు పెట్టడాని అధికారులు, చర్యలు తీసుకుంటున్నారు అని తెలిపారు.టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. విశాఖ పట్నానికి చెందిన స్వర్ణ సంస్థకు టెండర్లు దక్కాయి. త్వరలో ఈ పనులు మొదలవుతాయి అని తెలిపారు. సోమశిల హై లెవెల్ కెనాల్ భూసేకరణకు నిధులు విడుదల చేయాలని స్పెషల్ సిఎస్ కు కేబినెట్ లో CM ఆదేశాలు ఇచ్చారు అని అన్నారు. హంద్రీనీవాకు నిధులు సమకూర్చి ఈ ఏడాది పూర్తిచేసి చివరి భూములకు కుప్పం వరకు నీరు అందించాలని సీఎం ఆదేశించారు అని తెలిపారు.వాగు,చెరువు,నదీ పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది లేని భూములను పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు.ఇండియాతో యుద్ధం చేసే స్థాయి పాకిస్తాన్ కు లేదు అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఉగ్రవాదుల దయాదాక్షణ్యాల మీద మీద బ్రతుకుతున్న దేశం పాకిస్తాన్,భారతీయులంతా ఒక్కటై మిలిటరీ కి తోడుగా ఉండి పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పి కొడతాం అని అన్నారు.పాకిస్తాన్ విధానం ఉగ్ర విధానం,మిలటరీ చేతుల్లో బందీ అయిన ప్రభుత్వం పాకిస్తాన్, మహిళా కమాండర్ల దెబ్బకు పాకిస్తాన్ బెంబేలెత్తింది అని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో మహిళా శక్తి ముందుండి నడిపించింది అని తెలిపారు.పాకిస్తాన్తో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ కుటుంబానికి సంతాపం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని అన్నారు. పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మనమంతా రుణపడి ఉంటాం అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలియజేశారు.

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ