Mana News:- శ్రీకాళహస్తి మన న్యూస్:-. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నయోదు కార్యక్రమం పట్టణంలోని 22 వ వార్డు యూనిట్ ఇంచార్జి నెమళ్ళూరు బుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో, క్లస్టర్ ఇంచార్జి గెడిపూడి విజయకుమార్ గారి సూచనలతో టి.డి.పి. సభ్యత్వ నయోదు స్థానిక ఎన్టీఆర్ నగర్ నందు అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నెమళ్ళూరు బుజ్జి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కార్యకర్తల శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అనుకోని ప్రమాదాలు జరిగితే వారి కుటుంబం అనాధలు కాకుండా వారి కుటుంబాలకు ఆదుకునే విధంగా ప్రమాద భీమాను *ఐదు లక్షల రూపాయలకు* అందించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే సాధారణ మరణం జరిగితే మట్టి ఖర్చులకు గాను *పది వేల రూపాయలు* ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తావుంది. రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *