Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మన న్యూస్….శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కు బుధవారం రాజీవ్ నగర్ కు చెందిన ఓ నిరుపేద కుటుంబం చెందిన మహిళ తన చిన్న బిడ్డలతో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయానికి వచ్చింది. కార్యాలయంలో ఉన్న అధ్యక్షుడు వెంటనే ఆమె వివరాలు తెలుసు కోవడంతో బ్లడ్ క్యాన్సర్ అని ఆర్థికంగా ఆదుకోవాలని తన బిడ్డను బతికించాలని కోరడంతో వెంటనే స్పందించిన అధ్యక్షుడు కోటేశ్వరబాబు తక్షణ సహాయంగా వెయ్యి రూపాయలు ఆమె చేతికిచ్చి ప్రస్తుతం ఖర్చులకు ఉంచండి తర్వాత మేము మా ప్రెస్ క్లబ్ ద్వారా సహాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని హామి ఇచ్చి పంపారు. పై విషయాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆర్థికంగా కూడా సహాయం చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *