ఇవేం పనులు….రూ, 898 కోట్లు… 96 కిలోమీటర్లు..

.

765 డి జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో నాణ్యతకు తూట్లు…

సిమెంట్ పనులకు వాటర్ క్యూరింగ్ లేక పగుళ్లు,ఈ మురికి కాలువలు నిర్మాణం ఎంతవరకు శాశ్వతం.

వేరే ప్రాంతంలో తవ్విన తారు మట్టి రోడ్డుకు వినియోగం,రోడ్డు విస్తరణ పనులు ఎక్కువ సైజు కంకర వినియోగం.

మన న్యూస్ ,కామారెడ్డి,
చెప్పుకోవడానికి అది జాతీయ రహదారి, కానీ పనులు మాత్రం గ్రామీణ రోడ్డుకు చేస్తున్న పనుల కంటే హీనంగా జరుగుతున్నాయి. రూ, 898 కోట్ల రూపాయలతో 96 కిలోమీటర్ల రోడ్డు 765 డి జాతీయ రహదారి పనులు కామారెడ్డి జిల్లా మొదలుకొని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వరకు కొనసాగుతున్నాయి. మొదటి దశలో మెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు 44 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పనులకు 399 కోట్లు కేటాయించారు. ఎల్లారెడ్డి నుంచి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వరకు 52 కిలోమీటర్ల రహదారి పనులకు 499 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు ఒక ప్రముఖ కంపెనీకి అప్పగించారు. జాతీయ రహదారి పనుల నిర్మాణంలో చేపట్టవలసిన నిబంధనలను గాలికి వదిలేశారు. 898 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్న ఈ జాతీయ రహదారి పనులు నిర్మాణంలో నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న మురికి కాలువలు ఎంతవరకు శాశ్వతం అన్నదే ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. ఇరువైపులా నిర్మిస్తున్న గోడలు కేవలం 5 అంగుళాలతో నిర్మిస్తున్నారు. పొరపాటున ప్రమాదవశాత్తు చిన్న సైకిల్ ఢీకొన్న ఆ గోడ కూలిపోయేది పక్క. ముఖ్యంగా ఈ మురికి కాల్వలను నిర్మాణం పనులకు జరిగేటప్పుడు కచ్చితంగా వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ సంబంధిత కాంట్రాక్టర్ చేతులు ఎత్తివేశారు. ఫలితం ఎండలో ఎండుతూ పగుళ్ల బారిన పడుతున్నాయి. ముఖ్యంగా సిమెంట్ పనులకు ఎంతవరకు నీటితో తడుపుతే అన్ని రోజులు శాశ్వతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ కాంట్రాక్టర్ అధికార బలం, కండబలం, రాజకీయ బలం, అధికారుల అండ దండలు ఉండడంతో కోట్లాది రూపాయల తో నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు.ఎక్కువ సైజు కంకర వాడకం..
రోడ్డు విస్తరణ పనులకు చిన్న సైజు కంకర వాడాల్సి ఉండగా నిబంధనలు ఉల్లంఘించి పెద్ద కంకర సైజు వాడుతున్నారు. ఈ పెద్ద కంకర వేసి దానిమీద రాత్రి వేళలో మొరం వేసి ప్రజల కళ్ళలో కనిపించకుండా చేస్తున్నారు ఈ పనులు. పది కాలాలపాటు మన్నికంగా ఉండాల్సిన ఈ జాతీయ రహదారి పనుల్లో మొదటి నుంచి చివరి వరకు నాణ్యత లోపాలు బయట పడుతూనే ఉన్నాయి. కానీ వీటిని పర్యవేక్షించవలసిన డి ఈ , ఏఈలు కాంట్రాక్టర్కు వత్తస్తు పలుకుతున్నారు. ఫలితం జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు.వేరే చోట తవ్విన తారు మట్టి రోడ్డు విస్తరణ పనులకు వినియోగం వాస్తవంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టేటప్పుడు రోడ్డు కిరివైపులా తవ్వకాలు జరిపి, వాటిలో దొడ్డు కంకర, సన్నం కంకర వేసి రోలర్తో తొక్కించి ఆ తర్వాత మొరం వేసి నీటితో తడుపుతూ రోడ్డు గట్టిపడే వరకు రోలర్తో తొక్కించాల్సి ఉండగా ఇది పాటించడం లేదు. వేరేచోట తారు రోడ్డున తవ్వి ఆ తారు మట్టిని తీసుకువచ్చి ఈ రహదారి పనులకు వాడుతున్నారు. వాస్తవానికి ఇది వాడకూడదు. అయినా తమ పనులకు ఎవరు అడ్డు వస్తారు అన్న ధీమాతో కాంట్రాక్టర్ ఇష్ట రాజ్యాంగ పనులు సాగిస్తున్నారు. కోట్ల రూపాయలతో జరుగుతున్న పనుల విషయంలో సంబంధిత శాఖ అధికారులు నిద్ర మత్తు వదలకపోవడం వల్ల జాతీయ రహదారి పనుల్లో పూర్తిగా నాణ్యత లోపం బయటపడుతుంది.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..