

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్రముఖ వైద్యులు సఖి రెడ్డి విజయబాబు ఆయన తండ్రి వెంకటేశ్వరరావు 35వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏలేశ్వరం మండలు తన స్వగ్రామమైన మర్రివీడులో మంగళవారం ఉచితంగా వైద్య సేవలు అందించారు.ఈ వైద్య సేవలో పిఠాపురం సిఎంసి ఆసుపత్రి వైద్యులు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే విజయ్ బాబు తనయుడు ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు కాగా ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 200 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయబాబు మాట్లాడుతూ ఏజెన్సీకి ముఖ ద్వారం అయిన ఏలేశ్వరంలో విజయ నర్సింగ్ హెూమ్ స్థాపించి వైద్యం వ్యాపారంగా కాకుండా అంకితభావంతో రోగులకు సేవ చేస్తున్నామన్నారు. తన బాటలోనే తన తనయుడు కూడా వైద్యవృత్తులోనికి రావడం తడిని మరింత ఉత్సాహపరిచిందన్నారు.