

జనసేనలో చేరిన జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్,మున్సిపల్ వైస్ చైర్మన్,వైసీపీ కౌన్సిలర్లు,సర్పంచులు,
మనన్యూస్,పిఠాపురం:వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు.శుక్రవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ పెండెం దొరబాబుకి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఆయనతో పాటు పిఠాపురం నియోజకవర్గం వైసీపీ నేతలు పలువురు జనసేనలో చేరారు.జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు,పిఠాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ బుజ్జి,గొల్లప్రోలు మార్కెట్ కమిటీ చైర్మన్ మొగిలి వీరవెంకట సత్యనారాయణ (బాబ్జీ),గొల్లప్రోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొల్లపల్లి తిరుపతిరావు,ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు,కౌన్సిలర్లు కవడి పోసయ్య,బండి రవి,ఆర్.పావని,ఎం.లోవరాజు,పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సర్పంచులు నడిగట్ల చింతలరావు,కొత్తపల్లి లక్ష్మీరమణ బాబ్జీ,నెప్పల వరలక్ష్మి,కొత్తలూరి సునీత,మాదేపల్లి పార్వతి,బండి రాణి,ఉమ్మడి మేరీ జాన్,మాజీ డీసీ చైర్మన్ తుమ్మల బాబు,వైసీపీ జిల్లా డాక్టర్స్ సెల్ విభాగానికి చెందిన డాక్టర్ పి.రాజేష్,వైసీపీ పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ బొజ్జా దొరబాబులకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించగా,కార్యక్రమంలో పాల్గొన్న జనసిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైసీపీ సర్పంచులు,నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్,కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
