

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ నేతలు, వివిధ శాఖల అధికారులతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.మొహమ్మద్ నగర్ మండలంలోని నర్వ, గున్కుల్, తునికి పల్లి,గాలిపూర్, తెల్గాపూర్ గ్రామాలల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నిధులతో సిసి రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన అనంతరం కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ద్వేయంగా ముందుకెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తానని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. సదరు గుత్తేదారులు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,జిల్లా ఎస్టి సెల్ ఉపాధ్యక్షుడు లోక్యా నాయక్,గంగి రమేష్, కోరమండల్ సాయ గౌడ్,మల్లయ్య గారి ఆకాష్,సవాయి సింగ్,గొట్టం నర్సింలు,అబ్దుల్ కాలేక్,నాగభూషణం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


