

మనన్యూస్,పినపాక:ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా అగ్నిమాపక జట్టు నిలిచింది శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అగ్నిమాపక జట్టు,బిటిపీఎస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జట్టు తలపడ్డాయి.ఈ పోటీలో తొలుత బ్యాటింగ్ చేసిన బిటిపీఎస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జట్టు నిర్ణీత పది ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు సాధించగా,69 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అగ్నిమాపక జట్టు నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అగ్నిమాపక జట్టు క్రీడాకారుడు మధు కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా,టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన బిటిపీఎస్ క్రీడాకారుడు రమేష్ కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.విజేతలకు పినపాక తహశీల్దార్ అద్దంకి నరేష్ బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా తహశీల్దార్ నరేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం అన్నారు.అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం వలన ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది అన్నారు.నిత్యం విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి క్రీడలలో పాల్గోనడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి క్రాంతి కుమార్,ఎంపీవో వెంకటేశ్వరరావు, ఎన్.ఆర్.ఐ.కూనారపు ప్రసాద్,వినోద్ కుమార్, సతీష్ రెడ్డి,వెంకటరెడ్డి,ప్రెస్ క్లబ్ సభ్యులు బిల్లా నాగేందర్,భూరా శంకర్,కీసర సుధాకర్ రెడ్డి, ముక్కు మహేష్ రెడ్డి,సనప భరత్,కొంపెల్లి సంతోష్,గాడుదల దిలీప్,నగేష్,కోటి,జగదీష్, తదితరులు పాల్గొన్నారు.