

మనన్యూస్,తిరుపతి:తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పులిగోరు మురళీకృష్ణ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ గా ఆర్సి మునికృష్ణను ఎన్నుకోవడానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ రాత్రింబవళ్లు వ్యూహరచనలు పొంది ఎట్టకేలకు ఆర్సి మునికృష్ణను డిప్యూటీ మేయర్ గెలుపొందించుకోగలిగారు.ఆయన ఎన్నికకు పూర్తిగా రాష్ట్ర మంత్రి సత్య ప్రసాద్ కృషి పట్టుదలే కారణమని,మంత్రిత్వపాటు తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు పులివర్తి నాని లు వ్యూహరచనలు పొంది ఆర్సి మునికృష్ణ ఎన్నికకు పూర్తి సహకారం అందించినందుకు వారందరికీ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.