Mana News :- తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి వైసీపీ ఆభ్యర్థి ఎంపికపై మంగళవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ఎంపిక చేసేందుకు కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. 3వతేదీ జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవంగా అందరూ మద్దతుతో శేఖర్ రెడ్డిని గెలిపించుకోవాలని తీర్మానించారు. కూటమికి మద్దతు తెలిపిన వారు హాజరుకాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *